'కేసీఆర్ ఏం చేశారని టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు' | konda raghavareddy questions Ponguleti Srinivas on resignation | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ఏం చేశారని టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు'

May 3 2016 2:22 PM | Updated on Aug 21 2018 5:36 PM

'కేసీఆర్ ఏం చేశారని టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు' - Sakshi

'కేసీఆర్ ఏం చేశారని టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు'

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజకీయ జన్మనిచ్చింది వైఎస్ఆర్ సీపీ అని ఆ పార్టీ తెలంగాణ నేత కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజకీయ జన్మనిచ్చింది వైఎస్ఆర్ సీపీ అని ఆ పార్టీ తెలంగాణ నేత కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేశారని టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని పొంగులేటిని ఆయన సూటిగా ప్రశ్నించారు.

పార్టీ మారుతున్నందున పొంగులేటి తన పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని రాఘవరెడ్డి సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ ఉంటుందని అందులో ఎలాంటి సందేహం లేదని కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో సుచరితకే తమ పార్టీ మద్ధతు ఉంటుందని ఆయన స్పష్టంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement