కేపీహెచ్‌బీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత | illegal constructions collapsed in kphb colony | Sakshi
Sakshi News home page

కేపీహెచ్‌బీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

Oct 28 2015 1:27 PM | Updated on Sep 3 2017 11:38 AM

అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు

కూకట్పల్లి: అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ టెలిఫోన్ ఎక్స్ఛెంజ్ భవనం ఎదుట రోడ్డును ఆక్రమించుకొని  ఉన్న నిర్మాణాలను బుధవారం అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డుపై నిర్మించుకున్న సుమారు 70 గుడిసెలను అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నపలంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా చెప్తున్న బేఖాతరు చేస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement