బాబు బాత్ రూంలో జారిపడినా... | chevireddy comments on chandrababu | Sakshi
Sakshi News home page

బాబు బాత్ రూంలో జారిపడినా...

Feb 1 2016 4:13 PM | Updated on Aug 13 2018 4:11 PM

బాబు బాత్ రూంలో జారిపడినా... - Sakshi

బాబు బాత్ రూంలో జారిపడినా...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిపాలన చేతకాక ప్రతీదీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిపాలన చేతకాక ప్రతీదీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. చివరికి చంద్రబాబు బాత్ రూంలో జారిపడినా దానికి కారణం వైఎస్ జగనే అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని నెరవేర్చలేక ప్రజా ఉద్యమాలకు కారణమవుతున్నారని చెవిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి తన తీరు మార్చుకుంటే మంచిదని  చెవిరెడ్డి హితవు పలికారు.
 

Advertisement
 
Advertisement
Advertisement