బీరు లారీ బోల్తా..మందు బాబులు పండుగ | beer lorry rolls moosapet flyover | Sakshi
Sakshi News home page

బీరు లారీ బోల్తా..మందు బాబులు పండుగ

May 7 2016 8:40 AM | Updated on Sep 4 2018 5:21 PM

బీరు లారీ బోల్తా..మందు బాబులు పండుగ - Sakshi

బీరు లారీ బోల్తా..మందు బాబులు పండుగ

నగరంలోని మద్యం బాబులు పండుగ చేసుకున్నారు. మండుటెండలతో అల్లాడుతున్న మద్యం బాబులు ఫ్రీగా బీరు బాటిల్స్ను ఎత్తుకుపోయి ఎంజాయ్ చేసిన ఘటన మూసాపేటలో చోటుచేసుకుంది.

హైదరాబాద్: నగరంలోని మందు బాబులు పండుగ చేసుకున్నారు. మండుటెండలతో అల్లాడుతున్న మందుప్రియులు ఫ్రీగా బీరు బాటిల్స్ను ఎత్తుకుపోయి ఎంజాయ్ చేసిన ఘటన మూసాపేటలో చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మూసాపేట ఫ్లైఓవర్పై బీరు లోడుతో వెళ్తున లారీ ఒక్కసారిగా బోల్తా పడింది.

డ్రైవర్ రాంగ్‌రూట్‌లో రివర్స్ చూస్తుండగా అదుపుతప్పి లారీ కింద పడింది. దీంతో లారీలోని బీరు బాటిల్స్ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం అనంతరం డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. ఇదే అదునుగా భావించిన మందు బాబులు లారీలోని బీరు బాటిల్స్ను భారీగా ఎత్తుకుపోయారు. ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఫ్లై ఓవర్పై లారీని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement