వాచ్మెన్పై నటి తారా చౌదరి ఫిర్యాదు | Actress Tara Chowdary Complaints Against watchman | Sakshi
Sakshi News home page

వాచ్మెన్పై నటి తారా చౌదరి ఫిర్యాదు

Jun 17 2014 10:26 AM | Updated on Apr 3 2019 8:56 PM

వాచ్మెన్పై నటి తారా చౌదరి ఫిర్యాదు - Sakshi

వాచ్మెన్పై నటి తారా చౌదరి ఫిర్యాదు

నటి తారా చౌదరి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సెక్స్ రాకెట్ కేసులో ఒకప్పుడు రాష్ట్రంలో హాట్ టాఫిక్గా మారిన ఆమె తాజాగా వాచ్మెన్ వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్: నటి తారా చౌదరి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సెక్స్ రాకెట్ కేసులో ఒకప్పుడు రాష్ట్రంలో హాట్ టాఫిక్గా మారిన ఆమె తాజాగా వాచ్మెన్ వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. సోమవారం రాత్రి హఠాత్తుగా ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం అయ్యింది. తన పట్ల వాచ్మెన్ సుబ్రహ్మణ్యం అసభ్యంగా ప్రవర్తించి, దాడికి యత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి తాము నివాసం ఉండే అపార్ట్మెంట్ ఎదురుగా ఉండే కిరాణ దుకాణం యజమాని కూడా సహకరిస్తున్నాడని తారా చౌదరి తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుంటూరు జిల్లాకు చెందిన  రావెళ్ల రాజేశ్వరి.. అలియాస్ తారా చౌదరి గతంలో తనను వేధిస్తున్నారని, ప్రాణభయం ఉందంటూ అప్పటి ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు తనకు సినిమా అవకాశాలు ఇస్తానని రచయిత చిన్నికృష్ణ మోసం చేశారంటూ ఆత్మహత్యాయత్నం చేసి కలకలం సృషించింది. ఆ తర్వాత తన తమ్ముడిని కొందరు కిడ్నాప్ చేశారంటూ ఆమె గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియా కెక్కింది.

 

Advertisement
 
Advertisement
Advertisement