వారఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు)

Weekly Horoscope For 28th July To 3 Agust 2019 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  ఆరోగ్యభంగం. సన్నిహితుల నుంచి  ఒత్తిడులు పెరుగుతాయి. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు తిరస్కరిస్తారు.  వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం.  వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. కళాకారులు సామాన్యంగానే ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలులో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరిన్ని ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త లైసెన్సులు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి మంచిది.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పనులు సాఫీగా సకాలంలో  పూర్తి చేస్తారు. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. నిరుద్యోగుల యత్నాలు  సఫలం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉండవచ్చు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక విషయాలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి. రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త కాంట్రాక్టులు పోటీని తట్టుకుని దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో అనుకున్న రీతిలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. కళాకారులకు అవార్డులు, పురస్కారాలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్య సూచనలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పట్టింది బంగారమే కాగలదు. కుటుంబసభ్యులు మరింత ఆప్యాయత కనబరుస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పురోగతిలో సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో  ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. శ్రమ తప్పకపోవచ్చు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. వాహనాలు, భూములు కొంటారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కించుచకుంటారు. రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. వారం చివరిలో అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. తెలుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
 పాతబాకీలు వసూలవుతాయి. పెండింగ్‌ పనులు సైతం ప్రస్తుతం పూర్తి చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలపై కుటుంబసభ్యులతో సంప్రదింపులు. స్వల్ప అనారోగ్య సూచనలు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు, ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకోని సంఘటన ఆకట్టుకుంటుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.  ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వివాహ యత్నాలలో కదలికలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు స్వాగతిస్తారు.  వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.  కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు రాగలదు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో వివాదాలు. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. 

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి. రుణబాధలు తొలగుతాయి. పనులు సవ్యంగా పూర్తి కాగలవు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో విభేదాలు తొలగుతాయి. బంధువులు మీపై మరింత ఆదరణ చూపుతారు. చాకచక్యంగా వ్యవహరించి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. ఉద్యోగయత్నాలలో కొంత అనుకూలత. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  ఉన్నత హోదాలు దక్కే ఛాన్స్‌. రాజకీయవర్గాలకు ఆకస్మిక  విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు కొంత నత్తనడకన సాగుతాయి. ఆదాయ వ్యయాలు సమానస్థాయిలో ఉంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆప్తులతో ఉత్తరప్రత్యుత్తరాలు. భూములు, వాహనాలు కొనుగోలులో కొంత జాప్యం. నిరుద్యోగులు, విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కే సమయం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకోని ప్రగతి కనిపిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు సైతం పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో పురోగతి ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకమే. ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు రావచ్చు. కళారంగం వారికి  విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top