జింజర్‌బ్రెడ్ ఎనర్జీ బార్స్ | Gingerbread Energy Bars | Sakshi
Sakshi News home page

జింజర్‌బ్రెడ్ ఎనర్జీ బార్స్

May 1 2016 1:28 AM | Updated on Sep 3 2017 11:07 PM

జింజర్‌బ్రెడ్ ఎనర్జీ బార్స్

జింజర్‌బ్రెడ్ ఎనర్జీ బార్స్

బాదం గింజలు, జీడిపప్పును పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఆపైన వాటితో పాటు ఖర్జూరం, కిస్‌మిస్, యాలకుల పొడి, అల్లం పొడి, ఉప్పు, వెనిల్లా ఎసెన్స్...

కావలసినవి: బాదం గింజలు - 3/4 కప్పు, జీడిపప్పు - 3/4 కప్పు, సన్నగా తరిగిన ఖర్జూరం - 1 కప్పు, కిస్‌మిస్ - అరకప్పు, వెనిల్లా ఎసెన్స్ - 1 చెంచా, యాలకుల పొడి - అరకప్పు, ఎండబెట్టిన అల్లం పొడి - అరచెంచా, ఉప్పు - చిటికెడు, నీళ్లు - పావుకప్పు
 
తయారీ: బాదం గింజలు, జీడిపప్పును పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఆపైన వాటితో పాటు ఖర్జూరం, కిస్‌మిస్, యాలకుల పొడి, అల్లం పొడి, ఉప్పు, వెనిల్లా ఎసెన్స్... అన్నిటినీ కలిపి మిక్సీలో వేయాలి. కొద్దిగా నీళ్లు కూడా పోసి కాసేపు మిక్సీ పడితే అవన్నీ గుజ్జులా మారతాయి. అప్పుడా గుజ్జును ఓ ప్లేట్‌లోకి తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టాలి. ఓ గంట తర్వాత బయటకు తీసి చాకుతో ఫొటోలో కనిపిస్తున్నట్టు ముక్కలుగా కోసుకోవాలి. వాటిని గాలి తగలని డబ్బాలో పెట్టి,  ఫ్రిజ్‌లో ఉంచితే 2-3 వారాల వరకు తాజాగా ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement