స్ట్రాంగ్ లాయర్... సాఫ్ట్ ఫాదర్ అయ్యాడు! | become Strong Lawyer ... Father soft! | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్ లాయర్... సాఫ్ట్ ఫాదర్ అయ్యాడు!

Dec 14 2014 1:10 AM | Updated on Sep 2 2017 6:07 PM

స్ట్రాంగ్ లాయర్... సాఫ్ట్ ఫాదర్ అయ్యాడు!

స్ట్రాంగ్ లాయర్... సాఫ్ట్ ఫాదర్ అయ్యాడు!

సోనీ చానెల్ ప్రోగ్రామ్స్‌ని ఫాలో అయ్యేవాళ్ల ఫేవరేట్ షోలలో ‘అదాలత్’ తప్పకుండా ఉంటుంది.

టీవీక్షణం
సోనీ చానెల్ ప్రోగ్రామ్స్‌ని ఫాలో అయ్యేవాళ్ల ఫేవరేట్ షోలలో ‘అదాలత్’ తప్పకుండా ఉంటుంది. 2010 నుంచి నేటి వరకూ కూడా అత్యధిక టీఆర్పీతో సాగిపోతోన్న కార్యక్రమం ఇది. ఈ సక్సెస్‌లో అతి పెద్ద భాగం... అదాలత్ హీరో రోనిత్‌రాయ్‌దే. లాయర్ కేడీ పాఠక్‌గా అతడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు మరో షోకి కూడా తన కరిష్మాని జతచేశాడు రోనిత్.
     
ఇటీవలే సోనీలో ప్రారంభమైన ‘ఇత్‌నా కరోనా ముఝే ప్యార్’లో లీడ్ రోల్ చేస్తున్నాడు రోనిత్. ఇన్నాళ్లూ స్ట్రాంగ్ లాయర్‌గా ఆకట్టుకున్నవాడు, ఇందులో సాఫ్ట్ ఫాదర్‌గా కనిపిస్తు న్నాడు. మనస్పర్థల కారణంగా దూరమైన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ భార్యకు, కూతురికి దగ్గరవ్వాలని తహతహలాడే తండ్రిగా మనసుల్ని పిండుతున్నాడు. తన ఇమేజ్‌తో సీరియల్‌కి భారీ ఓపెనింగ్‌ని ఇచ్చిన రోనిత్... దాని విజయంలో కూడా ప్రధాన పాత్రధారి అవుతాడనడంలో సందేహమే లేదు!

Advertisement
 
Advertisement
Advertisement