ఎఫ్‌వన్ షోరన్ | Sakshi
Sakshi News home page

ఎఫ్‌వన్ షోరన్

Published Thu, Apr 2 2015 1:12 AM

ఎఫ్‌వన్ షోరన్ - Sakshi

ఫార్ములావన్ రేసింగ్ ... నగరవాసులు టీవీల్లోనే చూసే వేడుక. ఇప్పుడు ఇనిఫినిట్ రెడ్‌బుల్ రేసింగ్ టీమ్ స్టంట్స్‌ను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం వచ్చింది. ఏప్రిల్ 5న జరిగే ఈవెంట్... ఫార్ములా వన్ షోరన్‌కు హుస్సేన్ సాగర్ వేదికవుతోంది. రెండుసార్లు యురోపియన్ స్టంట్ రైడింగ్ ఛాంపియన్ గెలుచుకున్న లిథుయేనియన్ అరాస్ గిబేజా తన స్టంట్లతో అదరగొట్టనున్నాడు.

బాల్యంనుంచే ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్‌ను ఇష్టపడే గిబేజా... పదేళ్ల వయసులోనే వీల్స్‌ను రోడ్లపై పరుగెత్తించాడు. అది మొదలు ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. ప్రపంచంలోనే బెస్ట్ స్టంట్‌మెన్‌గా ఎదిగాడు. 13సార్లు గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచిన డేవిడ్ కోల్ట్‌హార్డ్... ఎఫ్‌వన్ కార్ డ్రైవింగ్‌తో నగరవాసులను ఆకట్టుకోనున్నాడు.

Advertisement
Advertisement