చిన్నప్పుడు | Special Story On Kalki Koechlin | Sakshi
Sakshi News home page

చిన్నప్పుడు

Jan 20 2020 3:39 AM | Updated on Jan 20 2020 3:39 AM

Special Story On Kalki Koechlin - Sakshi

ఇది వినకూడని సంగతైతే కాదు కానీ, తెలుసుకుంటే పోయేదేమీ లేని విషయమే. కల్కీ కోక్లాన్‌ పేరు కొత్తగా ఉన్నట్లే.. ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి కూడా కొత్తగానే ఉంది. కల్కి ఫ్రెంచి సంతతి భారతీయ నటి. బాలీవుడ్‌లో ఆమె మంచి సినిమాలే చేస్తున్నారు. వాటిల్లో ఒక మంచి సినిమా ‘జిందగి న మిలేగి దొబారా’. చిన్నప్పుడు స్కూల్లో ‘వెరీ నాటీ’ ఉండేదట కల్కి. ‘‘టీచర్‌ అలా బయటికి వెళ్లగానే ఇలా బాయ్స్‌ని కిస్‌ చేసేదాన్ని. అప్పుడు వాళ్లు చికాగ్గా బుగ్గలు తుడుచుకుంటుంటే నాకు భలే సరదాగా ఉండేది. యు నో.. ఆ ఏజ్‌లో మగపిల్లలు ఆడపిల్లల్ని అమితంగా ద్వేషిస్తుంటారు. ఆ ద్వేషం వాళ్ల ముఖంలో కనిపించేస్తుంటుంది. వాళ్లు అలా ఉన్నప్పుడు తటాలున వెళ్లి ముద్దు పెట్టేసేదాన్ని.  టీచర్‌ బయటికి వెళుతోందంటే.. అబ్బాయిలు నేనేం చేస్తానని ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండేవాళ్లు. కొందరైతే టీచర్‌ తోపాటు జంప్‌..’’ అని కల్కీ ఒకటే నవ్వడం!


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement