నొప్పి తెలియని జబ్బు... | Pain of unknown disease ... | Sakshi
Sakshi News home page

నొప్పి తెలియని జబ్బు...

Feb 14 2016 11:37 PM | Updated on Mar 23 2019 7:54 PM

ఈ జబ్బు ఉన్నవారిని శారీరకంగా ఎంతగా హింసించినా వారికి తెలియదు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా నొప్పే అనిపించదు.

ఈ జబ్బు ఉన్నవారిని శారీరకంగా ఎంతగా హింసించినా వారికి తెలియదు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా నొప్పే అనిపించదు. ఇదేదో బాగుందని అనుకుంటున్నారా? నొప్పి తెలియని ఈ కండిషన్ చాలా అరుదుగా వస్తుంది. యికంజెనిటల్ ఇన్‌సెన్సిటివిటీ టు పెన్’ (సిప్) అని పేర్కొనే ఈ వ్యాధిని వైద్యపరిభాషలో ‘కంజెనిటల్ అనాల్జెసియా’ అంటారు. నొప్పి తెలియనివ్వకుండా చేసే ఎండార్ఫిన్ అనే స్రావాలు మెదడులో మోతాదుకు మించి స్రవించడం వల్ల నొప్పి తెలియకపోవడంతో వాళ్లకు ఏదైనా శరీరక సమస్య వచ్చినా తెలియదు.

ఇన్ఫెక్షన్‌తో కనీసం పన్ను నొప్పి వస్తున్నా అది వాళ్లకు తెలియదు. దాంతో ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర ప్రాంతాలకు పాకి వాళ్ల ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అందుకే ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement