మునివేళ్లలో అందం... | health tips for nails and hands | Sakshi
Sakshi News home page

మునివేళ్లలో అందం...

Mar 30 2016 11:49 PM | Updated on Sep 3 2017 8:53 PM

మునివేళ్లలో అందం...

మునివేళ్లలో అందం...

గోళ్లు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో చెబుతాయి. విరగడం, పొడిబారి నిస్తేజంగా కనిపిస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.

 బ్యూటిప్స్

గోళ్లు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో చెబుతాయి. విరగడం, పొడిబారి నిస్తేజంగా కనిపిస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. దాంతో ఈ జాగ్రత్తలూ తీసుకోవాలి. 

చేతులను సబ్బు లేదా లిక్విడ్‌తో శుభ్రపరుచుకున్నాక గోళ్లు పొడిబారినట్టుగా అనిపిస్తే తప్పక లోషన్‌తో మసాజ్ చేసుకోవాలి, దీంతో గోళ్ల చుట్టూ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

గోళ్లను స్నానానంతరం కత్తిరించడం మేలు. నీళ్లలో నాని గోళ్లు గరుకుదనం తగ్గుతుంది. దీంతో ట్రిమ్ చేయడం సులువు అవుతుంది.

వెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి గోళ్లు మునిగేలా చేతులను ఉంచాలి. పది నిమిషాల తర్వాత గోళ్ల చుట్టూ ఉన్న మురికిని తొలగించాలి. తర్వాత మంచినీళ్లతో కడిగి, తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నెయిల్ పాలిష్‌లో బేస్ కోట్ ఉంటుంది. దీన్ని గోళ్లకు వేసుకుంటే గోళ్ల అందం రెట్టింపు అవుతుంది. త్వరగా గోళ్లు పాడవు.

 

Advertisement
 
Advertisement
Advertisement