అమ్మాయికీ, మమ్మీకి గొడవైంది | Sakshi
Sakshi News home page

అమ్మాయికీ, మమ్మీకి గొడవైంది

Published Thu, Dec 21 2017 12:55 AM

Celina Romantic Relationship with Canadian Singer - Sakshi

అమెరికన్‌ ఫిమేల్‌ సింగర్‌ సెలీనా గోమెజ్‌ (25), కెనడా పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ (23) ఇద్దరూ ఒకప్పుడు లవింగ్‌ ఫ్రెండ్స్‌. ఇప్పుడు మళ్లీ మరింత  లవింగ్‌ అవడంతో సెలీనా ఇంట్లో గొడవైంది. మదర్‌కీ, డాటర్‌కీ మాటామాటా పెరిగి సెలీనా మదర్‌ ఆసుపత్రి పాలయ్యారు! ‘పాపం.. మాండీ’ అని తెలిసినవాళ్లంతా వెళ్లి ఆమెను పరామర్శిస్తున్నారు. కూతురు కూడా తల్లిని చూడ్డానికి ఆసుపత్రికి వెళ్లింది కానీ, ‘నీ ముఖం నాకు చూపించకు పో’ అన్నట్లు ఆ తల్లి తనే ముఖం తిప్పేసుకుంది.  బీబర్‌తో విడిపోయాక మొన్న అక్టోబర్‌ వరకు ‘వీకెండ్‌’ మరో కెనడియన్‌ సింగర్‌తో సెలీనా రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆ ‘షిప్‌’ దానంతటదే మునిగిపోయిందో లేక బీబరే ప్లాన్‌ చేసి ముంచేశాడో తెలీదు.

మొత్తానికైతే పాత ప్రేమికులిద్దరూ తిరిగి కొత్తగా ప్రేమలో పడ్డారు. పడడం మాత్రమే కాదు. వైఫ్‌ అండ్‌ హస్బెండ్‌గా కూడా బిహేవ్‌ చేస్తున్నారు. అది సెలీనా ఇంట్లో నచ్చలేదు. బీబర్‌ యూత్‌ ఐకాన్‌ అయితే కావచ్చు, మన ఇంటికీ, వాడి ముఖానికి పడదని ఇంట్లోవాళ్లంతా ఎప్పుడో సెలీనాకు తెగేసి చెప్పేశారు. అప్పుడు వాళ్ల మాట విన్నట్లే విని, ఇప్పుడు మళ్లీ బీబరే నా సర్వస్వం అంటోంది సెలీనా! బీబర్‌ ఒక్క సెలీనా వాళ్ల ఇంట్లోనే కాదు.. అమెరికా, కెనడా దేశాలలోని చాలామంది ఇళ్లలో నచ్చడు. చిన్నవయసులో పెద్ద పేరు రావడంతో బీబర్‌ అదుపు తప్పాడు. ఆటోగ్రాఫ్‌ అడిగేందుకు మీదకు తోసుకొచ్చే అభిమానులను మూతీముక్కూ బద్దలు కొట్టడం అతడి హ్యాబీ. 

Advertisement

తప్పక చదవండి

Advertisement