పచ్చిమిరపతో క్యాన్సర్‌ దూరం! | Sakshi
Sakshi News home page

పచ్చిమిరపతో క్యాన్సర్‌ దూరం!

Published Wed, Sep 6 2017 12:42 AM

పచ్చిమిరపతో క్యాన్సర్‌ దూరం!

గుడ్‌ ఫుడ్‌
     

పచ్చి మిరపకాయ మన జీవక్రియల వేగాన్ని దాదాపు 50 శాతం పెంచుతుంది. కాబట్టి దీన్ని తీసుకుంటే దాదాపుగా జీరో క్యాలరీలు తీసుకున్నట్లే. అందుకే స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకున్నవారు మిరపకాయలను తీసుకోవడం మంచిది. (పరిమితం లేదా కాస్తంత ఎక్కువగా తీసుకుంటే చాలు). ∙పచ్చి మిరపలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. అయితే అన్నింటికంటే ముఖ్యంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్లను మరింత సమర్థంగా నిరోధిస్తాయి.

∙పచ్చి మిరపకాయలు రక్తంలోని కొలెస్ట్రాల్‌ పాళ్లను గణనీయంగా తగ్గిస్తాయి. తద్వారా గుండె, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. పక్షవాతం అవకాశాలను తగ్గిస్తాయి.  ∙పచ్చిమిరపకాయలలోని క్యాప్ససిన్‌ అనే పదార్థం వల్లనే దానికి ఆ కారపు రుచి. ఈ కారపు ఫ్లేవర్‌ తాకగానే ముక్కు, సైనస్‌లలోని మ్యూకస్‌ పలచబారి బయటకు వచ్చేస్తుంది.

ఇలా మిరపకాయ జలుబునూ, సైనస్‌ ఇన్ఫెక్షన్ల తీవ్రతను తగ్గిస్తుంది. ∙పచ్చి మిరపకాయలో విటమిన్‌–సి, బీటా కెరోటిన్‌ పుష్కలం. అందుకే మిరపకాయలు తినేవారిలో వారిలో మేని నిగారింపు ఎక్కువ. కళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి.  ∙పచ్చి మిరపలో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువ. అందుకే చర్మంపై ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు మిరపకాయలు తినేవారిలో అది వేగంగా తగ్గుతుంది. ∙తగినంత మోతాదులో మిరపకాయలను తినడం వల్ల ఆ రుచితో ఆహ్లాద భావన కలుగుతుంది. దానికి కారణం మెదడులో స్రవించే ఎండార్ఫిన్‌లు. అందుకే మిరప కొరికిన రుచి తగలగానే సంతోషంగా, రుచి చాలా బాగున్నట్లుగా అనిపిస్తుంది. ఎండార్ఫిన్లు మెదడు మూడ్స్‌ను సరిచేయడమే ఇందుకు కారణం. ∙పచ్చిమిరపలో విటమిన్‌–కె కూడా ఎక్కువే. అది గాయాలైనప్పుడు రక్తస్రావం అయ్యే ప్రమాదాలను అరికట్టడమే కాకుండా ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement