వ్యభిచార గృహంపై దాడి | The raid on the brothel | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై దాడి

Mar 7 2017 10:39 PM | Updated on Aug 20 2018 4:30 PM

వ్యభిచార గృహంపై దాడి - Sakshi

వ్యభిచార గృహంపై దాడి

స్థానిక కొర్లగుంటలోని కట్టకిం దపల్లెకు వెళ్లే సమీపంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఈస్ట్‌ సీఐ రాంకిశోర్‌ ఆదివారం

మహిళ, ఇద్దరు విటుల అరెస్ట్‌
నిర్వాహకులకు పోలీసు కానిస్టేబుల్‌ అండ..?


తిరుపతి క్రైం : స్థానిక కొర్లగుంటలోని కట్టకిం దపల్లెకు వెళ్లే సమీపంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఈస్ట్‌ సీఐ రాంకిశోర్‌ ఆదివారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలి సహా ఇద్దరు విటులను అరెస్టు చేశారు. సీఐ కథనం మేరకు.. కొర్లగుంటలో ఒక మహిళ (38) ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొద్ది రోజులుగా వ్యభిచార గృహం నడుపుతోంది. సరైన సమాచారం రావడంతో మహిళా పీసీలతో ఈ గృహంపై దాడిచేశారు. ఈ సందర్భంగా పులివెందులకు చెందిన మునికిశోర్‌రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన బాలకృష్ణారెడ్డి అనే ఇద్దరు విటులను అరెస్ట్‌ చేశారు.

ఒక మహిళను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు. వీరి నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే ఒక కానిస్టేబుల్‌తో సంబంధాలు ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇతనే వారికి అండగా ఉంటూ ఈ గృహాన్ని నడిపస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో నిజానిజాలను ఉన్నతస్థాయి అధికారులు తేల్చాల్సింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement