ఏ1 ముద్దాయి ముద్రగడ తప్పించుకోలేరు | TDP MLA badeti Bujji criticized mudragada Padmanabham | Sakshi
Sakshi News home page

ఏ1 ముద్దాయి ముద్రగడ తప్పించుకోలేరు

Feb 25 2016 4:56 PM | Updated on Aug 10 2018 8:16 PM

ఏ1 ముద్దాయి ముద్రగడ తప్పించుకోలేరు - Sakshi

ఏ1 ముద్దాయి ముద్రగడ తప్పించుకోలేరు

మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరోసారి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరోసారి రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. ఈ సారి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే నోరు పారేసుకున్నారు. ముద్రగడ వల్లే అనేక మంది అమాయకపు కాపులపై కేసులు నమోదయ్యాయని విమర్శించారు.

కేసుల నుంచి ఏ1 ముద్దాయి ముద్రగడ తప్పించుకోలేరని బడేటి బుజ్జి అన్నారు. కులాలతో ఓట్లు రాలవని, అందరూ ఓటేస్తేనే గెలుస్తారంటూ వ్యాఖ్యానించారు. తాను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కాపులతో పాటు వైశ్యులూ ఓటేశారని, అందువల్లే గెలిచానని చెప్పారు. కుల రాజకీయాలతో ప్రయోజనం ఉండదంటూ చంద్రబాబుకి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement