‘నుడా’ గెజిట్‌ విడుదల | SUDA gazette released | Sakshi
Sakshi News home page

‘నుడా’ గెజిట్‌ విడుదల

Nov 10 2016 12:28 AM | Updated on Sep 4 2017 7:39 PM

‘నుడా’ గెజిట్‌ విడుదల

‘నుడా’ గెజిట్‌ విడుదల

నెల్లూరు(పొగతోట): నెల్లూరు అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా)ను నెల్లూరు గెజిట్‌లో విడుదల చేశారు. కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు బుధవారం నుడా గెజిట్‌ నంబర్‌ 91ని విడుదల చేశారు.

  •  30 రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలి 
  • నెల్లూరు(పొగతోట): నెల్లూరు అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా)ను నెల్లూరు గెజిట్‌లో విడుదల చేశారు. కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు బుధవారం నుడా గెజిట్‌ నంబర్‌ 91ని విడుదల చేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి నెల్లూరు కార్పొరేషన్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలు, 21 మండలాలు 156 గ్రామాలు నుడా పరిధిలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 19 మండలాలు 145 గ్రామాలు, చిత్తూరు జిల్లాకు సంబంధించి 2 మండలాలు 11 గ్రామాలు నుడా పరిధిలో ఉన్నాయి. నుడాకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటి నుంచి 30 రోజులలోపు ప్రజలు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. జిల్లా యంత్రాంగం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తారు. 
     
      
     

Advertisement
 
Advertisement
Advertisement