‘నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలి’ | Sakshi
Sakshi News home page

‘నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలి’

Published Mon, May 22 2017 10:28 PM

'Qualified seeds should be delivered'

  •  వ్యవసాయశాఖ కమిషనర్‌ హరిజహార్‌ లాల్‌
  • గార్లదిన్నె : రైతులకు నాణ్యమైన విత్తన వేరుశనగ కాయలు, నవధాన్యాలు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ హరిజహార్‌లాల్‌ అన్నారు. సోమవారం మండలంలోని కల్లూరు గ్రామంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏపీ సీడ్స్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న నవ ధాన్యాల ప్రాసిసింగ్‌ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన నవధాన్యాల ప్యాకెట్‌ బరువు సరిచూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాన పంట వేరుశనగ వర్షాభావం వల్ల నష్టపోతే నవ ధాన్యాల వల్ల  ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీఏ శ్రీరాముర్తి, ఏడీ పీపీ విద్యావతి, మార్క్‌ఫెడ్‌ ఎండీ బాల భాస్కర్,  ఏడీఏ రామేశ్వర్‌ రెడ్డి, ఏపీ ఆయిల్‌ ఫెడ్‌  మేనేజర్‌ రెడ్డెప్ప, మండల వ్యవసాయ అధికారి శ్రీనాథ్‌రెడ్డి, ఎంపీఈఓలు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement