యువకుడిపై దాడి | Old Faction Disputes Some One Attack by Teenager | Sakshi
Sakshi News home page

యువకుడిపై దాడి

Jan 17 2017 10:48 PM | Updated on Sep 5 2017 1:26 AM

మండలంలోని రెడ్డిపల్లె చెరువువద్ద సోమవారం సాయంత్రం పాతకక్షలతో చిన్నరెడ్డయ్య అనే యువకుడిని ఈడిగపల్లె వాసుదేవపురం గ్రామానికి చెందిన చాపలమడుగు శివయ్య అతని అనుచరులు తీవ్రంగా గాయపరిచి మోటార్‌ సైకిల్‌ను దహనం చేశారు.

ఓబులవారిపల్లె: మండలంలోని రెడ్డిపల్లె చెరువువద్ద సోమవారం సాయంత్రం పాతకక్షలతో చిన్నరెడ్డయ్య అనే యువకుడిని ఈడిగపల్లె వాసుదేవపురం గ్రామానికి చెందిన చాపలమడుగు శివయ్య అతని అనుచరులు తీవ్రంగా గాయపరిచి మోటార్‌ సైకిల్‌ను దహనం చేశారు. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. తన స్నేహితుడు అయిన ఈడిగపల్లెకు చెందిన ఉదయ్‌కుమార్‌ సోమవారం సాయంత్రం రెడ్డిపల్లె చెరువుకట్ట వద్దకు రమ్మని ఫోన్‌చేయగా తాను మోటార్‌ సైకిల్‌పై రాజంపేట నుంచి చెరువు కట్ట వద్దకు వెళ్లినట్లు తెలిపాడు. ఈ సమాచారం తెలుసుకున్న చాపలమడుగు శివయ్య, సూరి, లోకేష్, నరేష్, మహేష్‌లతోపాటు మరో నలుగురు స్కార్పియో వాహనంలో వచ్చి తనను తీసుకెళ్లి దాడిచేసి తీవ్రంగా గాయపరచినట్లు బాధితుడు తెలిపాడు. అపస్మారక స్థితికి చేరుకున్న తనను గుండు గీయించి వదిలేసి తన మోటార్‌సైకిల్‌కు నిప్పంటించి దహనం చేశారని వాపోయాడు. తనను కొందరు గమనించి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారన్నాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement