భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య | Man kills wife and commits suicide | Sakshi
Sakshi News home page

భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య

Feb 6 2016 3:07 PM | Updated on Nov 6 2018 7:56 PM

భార్యను హత్య చేసి ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా భోద్ మండలం సాకిరా గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది.

బోథ్ (ఆదిలాబాద్ జిల్లా): భార్యను హత్య చేసి ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా భోద్ మండలం సాకిరా గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన బడుగు సుజాత(28)పై అనుమానంతో ఆమె భర్త బడుగు సురేష్(35)తాడుతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

సురేష్ ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యను అనుమానించిన అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement