నేడు తాడిపత్రికి కళాతపస్వి | k.viswanath comes tadipatri today | Sakshi
Sakshi News home page

నేడు తాడిపత్రికి కళాతపస్వి

Dec 3 2016 11:43 PM | Updated on Sep 4 2017 9:49 PM

స్థానిక సరస్వతీ విద్యామందిరంలో ఆదివారం జరిగే ఘంటసాల పోటీల్లో విజేతల బహుమతుల పంపిణీకి ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ పాల్గొంటారని స్థానిక శ్రీ అన్నమయ్య సంకీర్తనా సేవా సమితి సభ్యుడు మహేష్‌స్వామి ఒక ప్రకటనలో తెలిపారు.

తాడిపత్రి టౌన్‌ : స్థానిక సరస్వతీ విద్యామందిరంలో ఆదివారం జరిగే ఘంటసాల పోటీల్లో విజేతల  బహుమతుల పంపిణీకి ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ పాల్గొంటారని స్థానిక శ్రీ అన్నమయ్య సంకీర్తనా సేవా సమితి సభ్యుడు మహేష్‌స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఘంటసాల జయంతిని పురస్కరించుకుని అన్నమయ్య సంకీర్తనా సేవా సమితి  ఆధ్వర్యంలో నవంబర్‌ 27వ తేదీన ఘంటసాల, జానకి, సుశీల పాడిన పాటలపై పోటీలు నిర్వహించామన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులను కె.విశ్వనాథ్‌ పంపిణీ చేస్తారన్నారు. అలాగే ఉదయం ఆర్‌వీ స్వామి కల్యాణ మండపంలో చర్చావేదికలో కె.విశ్వనాథ్‌ పాల్గొంటారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement