వీఆర్‌ఏల వేతనాలకు రూ.49 కోట్లు | granted the vra's wages | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల వేతనాలకు రూ.49 కోట్లు

Sep 2 2016 7:50 PM | Updated on Sep 4 2017 12:01 PM

తెలంగాణ వ్యాప్తంగా వీఆర్‌ఏల రెండో త్రై మాసిక పెండింగ్‌ వేతనాల కోసం రూ.49.93 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం గౌరవాధ్యక్షుడు హరి అశోక్‌కుమార్‌ తెలిపారు.

జగిత్యాల రూరల్‌: తెలంగాణ వ్యాప్తంగా వీఆర్‌ఏల రెండో త్రై మాసిక పెండింగ్‌ వేతనాల కోసం రూ.49.93 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం గౌరవాధ్యక్షుడు హరి అశోక్‌కుమార్‌ తెలిపారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలకు రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్‌కు భూమి శిస్తు కమిషనర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. వీఆర్‌ఏల కేంద్ర సంఘం గౌరవాధ్యక్షుడు ఎం.శివశంకర్‌ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రికి, సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement