తిరుపతిలో 'వీడియో కాలింగ్‌' ఐటీ కంపెనీ! | Sakshi
Sakshi News home page

తిరుపతిలో 'వీడియో కాలింగ్‌' ఐటీ కంపెనీ!

Published Tue, Feb 9 2016 9:54 PM

first IT company at tirupati

తిరుచానూరు: తిరుమత తిరుపతి దేవాయలం దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇప్పుడు ఈ దేవాలయం సమీపంలో తొలి ఐటీ కంపెనీ వెలిసింది. అమెరికాకు చెందిన 'కమ్యుని క్లిక్' ఐటీ కంపెనీ తిరుపతిలో ఏర్పాటైంది. ఈ కంపెనీకి భారతీయ భాగస్వాములైన డాక్టర్ బాలరామిరెడ్డి బోర్డు చైర్మన్‌గా, ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ గోపాల్‌రెడ్డి (డెరైక్టర్‌), కంట్రీ హెడ్‌గా సురేష్ పెరుగు వ్యవహరించనున్నారు. వీరు ఎస్వీయూ పూర్వ విద్యార్థులు కావడం గమనార్హం.

కమ్యుని క్లిక్ సీఈవో ఆండ్రూ పవర్, బోర్డు చైర్మన్ బలరామిరెడ్డి మంగళవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో విలేకరులతో ఈ వివరాలను వెల్లడించారు. తిరుపతిలో ఐటీ సంస్థ అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు స్కైప్, గూగుల్ ప్లస్ వంటి అప్లికేషన్లతో కాన్ఫరెన్స్ వీడియో కాలింగ్ నిర్వహిస్తున్నాయన్నారు. మరింత మెరుగైన, నాణ్యమైన వీడియో కాలింగ్‌ను అభివృద్ధి చేయడం, వీడియో కాలింగ్‌కు అనుబంధంగా యాప్స్‌ను రూపొందించేందుకు ఈ ఐటీ కంపెనీ ఏర్పాటయిందని పేర్కొన్నారు. ఇప్పటికే సిబ్బంది నియామకం చేపట్టినట్లు తెలిపారు. శ్రీవారి ఇన్నోవేషన్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement