రైలు కింద పడి ఆర్మీ జవాను ఆత్మహత్య | Fell under the train Army jawan commits suicide | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి ఆర్మీ జవాను ఆత్మహత్య

Dec 12 2016 10:42 PM | Updated on Sep 4 2017 10:33 PM

రైలు కింద పడి ఆర్మీ జవాను ఆత్మహత్య

రైలు కింద పడి ఆర్మీ జవాను ఆత్మహత్య

ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌ సమీపంలో ఇంటర్‌సిటీ ప్యాసింజర్‌ రైలు కింద పడి చిన్నకోట్ల సుబ్బరాయుడు(32) అనే ఆర్మీ జవాను ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌ సమీపంలో ఇంటర్‌సిటీ ప్యాసింజర్‌ రైలు కింద పడి  చిన్నకోట్ల సుబ్బరాయుడు(32) అనే ఆర్మీ జవాను ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. వేముల మండలం వేముల కొత్తపల్లి గ్రామానికి చెందిన చిన్నకోట్ల వీరన్న కుమారుడు చిన్నకోట్ల సుబ్బరాయుడు జమ్ము కాశ్మీర్‌లో సిగ్నిల్‌ డిపార్టుమెంట్‌లో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి కమలాపురం మండలం పెద్దచెప్పలి గ్రామానికి చెందిన రాజేశ్వరితో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇతని ఆత్మహత్యకు వ్యక్తిగత సమస్యలే కారణమని ఎస్‌ఐ తెలిపారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement