సొమ్ము కోసం వచ్చి సృహ తప్పాడు! | Except for money and passed out! | Sakshi
Sakshi News home page

సొమ్ము కోసం వచ్చి సృహ తప్పాడు!

Dec 26 2016 10:56 PM | Updated on Jun 1 2018 8:39 PM

సొమ్ము కోసం వచ్చి సృహ తప్పాడు! - Sakshi

సొమ్ము కోసం వచ్చి సృహ తప్పాడు!

మండలంలోని చినిగానిపల్లికి చెందిన గండారెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద సోమవారం సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ ..

అమడగూరు : మండలంలోని చినిగానిపల్లికి చెందిన గండారెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద సోమవారం సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ నగదు కోసం ఉదయం నుంచి బ్యాంకు వద్దే కాచుకుని కూర్చున్నామన్నారు. సాయంత్రం వరకూ తిండి, నీరు లేక పోవడంతో బీపీ తగ్గిపోయి ఆయన సృహ తప్పిపడి పోయినట్లు తెలిపారు. వెంటనే అతడిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. కాగా నగదు కోసం ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఉదయం నుంచి కదిరి బ్యాంకులో వేచి చూసి, డబ్బులివ్వక పోవడంతో వెనక్కి వచ్చినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement