పదేళ్లుగా పాలు ఇస్తూనే ఉంది
సాధారణంగా ఆవులు, గేదెలు ఈనిన తర్వాత 10 నెలలు పాలు ఇవ్వడం పారిపాటి.
తాడిపత్రి : సాధారణంగా ఆవులు, గేదెలు ఈనిన తర్వాత 10 నెలలు పాలు ఇవ్వడం పారిపాటి. కానీ పెద్దవడుగూరు మండలం బాందర్లపల్లి గ్రామానికి చెందిన రైతు రామక్రిష్ణ వద్ద ఉన్న ఓ ఆవు 10 సంవత్సరాలుగా రోజుకు నాలుగు లీటర్ల పాలు ఇస్తోంది. ఈ విషయాన్ని శుక్రవారం మండల పశువైద్యాధికారిణి భారతి స్వయంగా వెళ్లి పరిశీలించి ధ్రువీకరించారు. హోర్మోన్లు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఆవులు ఇలా నిరంతరం పాలు ఇస్తాయని ఆమె తెలిపారు.


