బాలయ్య పీఏ అవినీతి.. కరపత్రాలు విడుదల | balakrishna pa commited corruption | Sakshi
Sakshi News home page

బాలయ్య పీఏ అవినీతి.. కరపత్రాలు విడుదల

Aug 17 2015 10:35 PM | Updated on Sep 22 2018 8:22 PM

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ.. కరపత్రాల పంపిణీ జరిగింది

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ.. కరపత్రాల పంపిణీ జరిగింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో.. ఈ వార్త ధావనంలా పాకింది. కరపత్రంలో తెలిపిన వివరాల ప్రకారం ‘‘ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఎందరో మహానుభావులు విజయం సాధించారు.

అయితే వారు చేయని పనిని ఘన కీర్తి సాధించిన ప్రస్తుతం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసి చూపిస్తున్నాడని తెలిపారు. ఎన్టీఆర్‌పై మమకారంతో ఓట్లు వేసి గెలిపించిన హిందూపురం ప్రజలైతే ఇక్కడ ప్రజల అభిమానాన్ని నోట్ల రూపంలో అతని ఇన్‌చార్జ్ శేఖర్ ప్రజల నుంచి వసూలు చేస్తాన్నాడని’’ అందులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement