ఆయిల్ ట్యాంకర్‌లో 950 కిలోల గంజాయి | 950 kgs of marijuana seized | Sakshi
Sakshi News home page

ఆయిల్ ట్యాంకర్‌లో 950 కిలోల గంజాయి

Sep 16 2016 7:22 PM | Updated on Sep 4 2017 1:45 PM

ఆయిల్ ట్యాంకర్‌లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అనకాపల్లి (విశాఖపట్నం) : ఆయిల్ ట్యాంకర్‌లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆయిల్ ట్యాంకర్‌లో తరలిస్తున్న 950 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మన్యం నుంచి మహానగరానికి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement