మెట్రో స్టేషన్‌ సమీపంలో తలలేని మృతదేహం | Woman Headless Body Found Near Delhi Metro Station | Sakshi
Sakshi News home page

మెట్రో స్టేషన్‌ సమీపంలో తలలేని మృతదేహం

Jun 9 2019 9:00 AM | Updated on Jun 9 2019 9:28 AM

Woman Headless Body Found Near Delhi Metro Station - Sakshi

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని జహంగీపూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో తలలేని మహిళా మృత దేహం లభ్యమైంది. దుప్పటిలో చుట్టి ఉన్న మృతదేహాన్ని పోలీసులు శనివారం రాత్రి గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించగా రెండు మూడు రోజుల క్రితమే మహిళను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. శరీరం నల్లగా మారి పాడైపోయే స్థితికి చేరుకుందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం బాబు జగ్జీవన్ రాం మెమొరియల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement