మామ కాదు.. మృగాడు | Uncle Knife Attack On DaughterInLaw In YSR Kadapa | Sakshi
Sakshi News home page

మామ కాదు.. మృగాడు

Jun 11 2018 10:52 AM | Updated on Jul 30 2018 8:37 PM

Uncle Knife Attack On DaughterInLaw In YSR Kadapa - Sakshi

రిమ్స్‌లో వైద్యం పొందుతున్న సుగుణ

సిద్దవటం : తన కోరిక తీర్చలేదని కోడలిపై మామ మచ్చుకతిత్తో  దాడిచేసిన సంఘటన భాకరాపేటలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం భాకరాపేటలోని ఆంజనేయ స్వామి గుడి వెనుక వీధిలో కాపురం ఉంటున్న కాడే సుబ్బయ్య కుమారుడు రామమోహన్‌ అలియాస్‌ రామయ్యకు కదిరికి చెందిన సుగుణతో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు.  వీరంతా ఒకే ఇంటిలో కాపురం ఉన్నారు.  సుబ్బయ్య  గతంలో సుగుణపై లైంగిక దాడికి యత్నించాడు. అప్పట్లో రెండు సార్లు పెద్దమనుషులు పంచాయితీ కూడా చేశారు.  సుబ్బయ్య వేధింపులు ఎక్కువ కావడంతో  రెండు రోజుల క్రితం ఆమె మామపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు వస్తే ఇంటివద్ద ఉండటం లేదు.  దీంతో సుబ్బయ్య తనపైనే పోలీసు స్టేషన్‌లో కేసు పెడతావా అని కోడలిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయ  కోడలు సుగుణ  ఇంట్లో మాంసం కోసుకుంటుండగా వెనుక వైపు నుంచి వచ్చిన సుబ్బయ్య ఆమె కాళ్లు, చేతులపై మచ్చుకత్తితో దాడి చేశాడు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వైద్య కోసం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. సుబ్బయ్యను అదుపులోకి  తీసుకొని అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement