పేషెంట్‌ బ్యాగు తీసి పక్కన పెట్టినందుకు.. | Patient Attendant Attacked Junior Doctor In Niloufer Hospital Hyderabad | Sakshi
Sakshi News home page

బ్యాగు పక్కన పెట్టిన జూడాపై రోగి బంధువుల దాడి

Aug 27 2019 11:38 AM | Updated on Aug 27 2019 12:28 PM

Patient Attendant Attacked Junior Doctor In Niloufer Hospital Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పేషెంట్‌ బెడ్‌ మీద ఉన్న బ్యాగు తీసి పక్కన పెట్టిన జూనియర్‌ డాక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన చర్యకు ఆగ్రహంతో ఊగిపోయిన బంధువులు సదరు జూనియర్‌ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని నీలోఫర్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాలు..మంగళవారం విధుల్లో ఉన్న ఓ జూనియర్‌ డాక్టర్‌ రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఆస్పత్రిలో చేరిన పేషెంట్స్‌ బెడ్‌ కోసం చూస్తుండటాన్ని గమనించారు.

ఈ క్రమంలో అప్పటికే ఆస్పత్రిలో చేరిన మరో రోగి బ్యాగు బెడ్‌పై ఉండటాన్ని గమనించిన జూనియర్‌ డాక్టర్‌ దానిని తీసి పక్కన పెట్టి కొత్త పేషెంట్స్‌కు బెడ్‌ వాడుకోవాల్సిందిగా సూచించాడు. దీంతో కోపోద్రిక్తులైన సదరు రోగి బంధువులు జూనియర్‌ డాక్టర్‌ను దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నీలోఫర్‌ ఆస్పత్రి హెచ్‌వోడీ  తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement