వైద్య కళాశాల ప్రొఫెసర్‌ ఆత్మహత్య | Medical College Professor Commits Suicide In Puducherry | Sakshi
Sakshi News home page

వైద్య కళాశాల ప్రొఫెసర్‌ ఆత్మహత్య

Dec 13 2018 4:11 PM | Updated on Dec 13 2018 7:44 PM

Medical College Professor Commits Suicide In Puducherry - Sakshi

రూప్ కుమార్‌ మృతదేహం

సాక్షి, చైన్నై: ఆంధ్రాకు చెందిన వైద్య కళాశాల ప్రొపెసర్‌ రూప్ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడలోని పుదుచ్చేరిలో చోటు చేసుకుంది.  ఈ ఘటన గురువారం మూడు గంటల సమయంలో కళాశాల గెస్ట్‌ హౌస్‌లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాలు... రూప్‌ కుమార్‌ది చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. కుమార్‌కు ఇద్దరు పిల్లలు, ఆయన భార్య ఉషారాణి ఆంధ్రాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబందించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఈ ఘటనపై విల్లియనూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement