అక్క ప్రియుడిపై కత్తితో దాడిచేసిన సోదరుడు | Knife Attack in Tamil nadu Police Station | Sakshi
Sakshi News home page

అక్క ప్రియుడిపై కత్తితో దాడిచేసిన సోదరుడు

Dec 8 2018 11:07 AM | Updated on Dec 8 2018 11:18 AM

Knife Attack in Tamil nadu Police Station - Sakshi

వివాహిత ప్రియుడితో పారిపోయిన వ్యవహారంలో వారిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నారు.

చెన్నై, తిరువొత్తియూరు: వివాహిత ప్రియుడితో పారిపోయిన వ్యవహారంలో వారిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో ప్రియుడిపై వివాహిత తమ్ముడు కత్తితో దాడి చేశాడు. విరుదాచలం, పెన్నాడు సమీపం కొత్తపై గ్రామానికి చెందిన వసంతకుమార్‌ (27). అతనికి బంధువు అయిన సెల్వవేల్‌ కుమార్తె శశిప్రియ (26)తో ఆరు నెలల క్రితం వివాహం అయ్యింది. గత నెలలో పుట్టింటికి వెళ్లిన శశిప్రియకు పడుగలై గ్రామానికి చెందిన ప్రకాష్‌ (28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

వీరిద్దరూ ఊరు వదలి పారిపోయారు. దీనిపై వసంతకుమార్, అతని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెన్నడం పోలీసులు చెన్నైకి వెళ్లి శశిప్రియ, ప్రకాష్‌ ఇద్దరిని పోలీసుస్టేషన్‌కు రప్పించారు. శశిప్రియ, వసంతకుమార్, ప్రకాష్‌ల తల్లిదండ్రులను పోలీసుస్టేషన్‌కు రప్పించి చర్చలు జరుపుతున్నారు. ఆ సమయంలో శశిప్రియ తాను ప్రకాష్‌తో వెళతానని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన శశిప్రియ తమ్ముడు శ్రీరంగన్‌ (25) తాను వెంటతెచ్చుకున్న కత్తిని బయటకు తీసి ప్రకాష్‌ ముఖంపై దాడి చేశాడు. తదుపరి తిరిగి అతనిపై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర గాయాలైన ప్రకాష్‌ను పెన్నాడం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు అందుకున్న పెన్నడం పోలీసులు శ్రీరంగన్‌ను అరెస్టు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement