నకిలీ పోలీసు ముఠా అరెస్టు | Fake Police Gang Artist In Vijayawada | Sakshi
Sakshi News home page

నకిలీ పోలీసు ముఠా అరెస్టు

Dec 19 2018 4:33 PM | Updated on Dec 19 2018 4:33 PM

Fake Police Gang Artist In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలో పోలీసుల మని చెప్పి ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నముఠాను  టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... అరెస్టు చేసిన ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు. కానిస్టేబుళ్లు తన స్నేహితుడు శ్రీనివాసరావుతో  కలసి ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు.

కానిస్టేబుళ్లు నరేష్‌ కుమారు(జార్ఖాండ్‌ బెటాలియన్‌), వల్లభేని స్వామి( ఛత్తిస్‌ ఘడ్‌ బెటాలియన్‌)ల్లో పని చేస్తున్నట్లు గుర్తించామని పోలీసలు వెల్లడించారు. స్నేహితుడు శ్రీనివాసరావుతో కలిసి వసూళ్లకు దిగిన నరేష్ కుమార్, వల్లభనేని స్వామి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement