ప్రియురాలి కోసం కారు చోరీ | Car Robbery For Lover In Hyderbabd | Sakshi
Sakshi News home page

ప్రియురాలి కోసం కారు చోరీ

May 4 2018 2:11 PM | Updated on Sep 19 2018 8:25 PM

Car Robbery For Lover In Hyderbabd - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ కెఎస్‌ రావు

బంజారాహిల్స్‌ : ప్రియురాలితో షికారు చేసేందుకు ఓ యువకుడు కారు దొంగిలించి కటకటాల పాలైన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్, డీఎస్‌ఐ నాగరాజు గౌడ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... కర్మన్‌ఘాట్‌కు చెందిన నెల్లవెట్ల ప్రశాంత్‌రెడ్డి, ఓంసాయి మెడికల్స్‌లో సేల్స్‌మెన్‌గా పని చేస్తూ  జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌లో ఉంటున్నాడు. ఆదిలాబాద్‌ జిల్లా, చంద్రాపూర్‌ ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు.

తనకు పెళ్లి కుదిరిందని ఇక్కడి నుంచి తీసుకుపోవాలంటూ గత నెల 25న సదరు యువతి ఫోన్‌ చేయడంతో ఆమె ను తీసుకెళ్లేందుకు తన యజమాని రాజేందర్‌రెడ్డి స్కోడా కారును దొంగిలించి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆమెతో కలిసి ప్రియురాలితో గోవా వెళ్లేందుకు పథకం వేశాడు. ముందుగా విజయవాడ కనకదుర్గను దర్శించుకొని అక్కడి నుంచి స్నేహితుడు రాజ్‌కుమార్‌ సహాయంతో గోవాకు బయలుదేరుతుండగా,  బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోన్‌నంబర్‌ ఆధారంగా కారు నార్కట్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లు గుర్తించారు. చంపాపేట్‌లో నిఘా వేసి నిందితుడిని అరెస్ట్‌ చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement