రెచ్చిపోయిన ఫేస్‌బుక్‌ ప్రేమోన్మాది | Attempt to murder in old city | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన ఫేస్‌బుక్‌ ప్రేమోన్మాది

Oct 7 2018 2:13 AM | Updated on Oct 7 2018 5:03 AM

Attempt to murder in old city - Sakshi

మంటల్లో తీవ్రంగా గాయపడిన ఇబ్రహీం

హైదరాబాద్‌: ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన యువతి పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్నాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అడ్డువచ్చిన మరో మహిళకు కూడా మంటలంటుకున్నాయి. ఈ సంఘటన హైదరాబాద్‌ పాతబస్తీలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కుమ్మరివాడిలో నివసిస్తున్న ఆబేదాబేగం, షేక్‌ ఇస్మాయిల్‌కు ఆరుగురు కూతుళ్లు, ఒక కుమారుడు.

బార్కాస్‌కు చెందిన ఇబ్రహీం(30) వృత్తిరీత్యా మొబైల్‌ టెక్నీషియన్‌. గతేడాది ఫేస్‌బుక్‌ ద్వారా ఇస్మాయిల్‌ కూతురు షబానాబేగంతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఈ విష యం తెలుసుకున్న షబానా కుటుంబ సభ్యులు బార్కాస్‌ కు వెళ్లి విచారించగా అతడికి వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఇరువురిని కలవకుండా చేసి, టప్పాచబుత్రా పోలీ స్‌స్టేషన్‌లో ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేశారు.

అప్పటి నుంచి పెళ్లి చేసుకుందామంటూ ఇబ్రహీం రోజూ ఒత్తిడి తెస్తుండగా షబానాబేగం నిరాకరిస్తోంది. దీంతో శనివారం ఉదయం కుమ్మరివాడిలోని షబానాబేగం ఇంటికి వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని షబానా బేగంపై పోసి నిప్పంటించుకుని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. షబానా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న షబానా వదిన ఆజిమాబేగం వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి తీవ్ర గాయాలపాలైంది. షబానాబేగం, ఇబ్రహీం,అజిమాబేగంలను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement