యువకుడిని ఢీకొన్ననటి యాషిక కారు

Actress Yashika Car Accident to Youngman in Tamil Nadu - Sakshi

చెన్నై,పెరంబూరు: అర్ధరాత్రి నటి యాషికా కారు వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిని ఢీకొంది. దీంతో ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికి నుంగంబాక్కం సమీపంలో శనివారం రాత్రి  ఒక ఖరీదైన కారు వేగంగా  వచ్చింది. స్థానిక హారింగ్‌టన్‌ రోడ్డు వద్ద అదుపు తప్పి వ్యక్తిని ఢీకొంది. అతనికి తీవ్ర గాయాలు కావడంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా  ఈ సంఘటనపై పాండిబజార్‌ పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి వచ్చారు. కాగా పోలీసుల విచారణలో ఆ కారులో నటి యాషిక తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ ముగించుకుని వస్తూ ఈ యాక్సిడెంట్‌ చేసినట్లు తెలిసింది.  పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top