ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

Published Fri, Apr 20 2018 3:57 PM

Sensex Ends Off Days Low Points, Nifty Above 10550 - Sakshi

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 12 పాయింట్లు పడిపోయి 34,416 వద్ద, నిఫ్టీ 1 పాయింట్‌ పడిపోయి 10564 వద్ద  క్లోజయ్యాయి. బ్యాంక్స్‌, మెటల్‌ స్టాక్స్‌ ఎక్కువగా కరెక్షన్‌కు గురికావడంతో, ఆద్యంతం మార్కెట్లు ఒత్తిడికి గురి అవుతూనే ఉన్నాయి. అయితే ఐటీ షేర్లు మాత్రం నేటి ట్రేడింగ్‌లో లాభాలు పండించాయి. టీసీఎస్‌ ఫలితాలు, రూపాయి విలువ పడిపోవడం ఐటీ షేర్ల లాభాలకు దోహదం చేసింది. టీసీఎస్‌ 6.5 శాతం మేర ర్యాలీ జరిపి రూ.3400 మార్కును తాకింది.

100 బిలియన్‌ డాలర్ల మార్కుకు కొద్దీ దూరంలో దీని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పెరిగింది. 100 బిలియన్‌ డాలర్ల మార్కుకు తాకబోతున్న తొలి దేశీయ కంపెనీ ఇదే. టీసీఎస్‌తో పాటు, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహింద్రా నేటి ట్రేడింగ్‌లో టాప్‌ గెయినర్లుగా నిలిచాయి. యస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు పడిపోయి 66.04 గా ఉంది. 
 

Advertisement
Advertisement