అమ్మకాల సెగ : నష్టాల్లో  సూచీలు  | Sakshi
Sakshi News home page

అమ్మకాల సెగ : నష్టాల్లో  సూచీలు 

Published Wed, Jul 10 2019 2:25 PM

Sensex  Nifty down TCS Drops After Earnings Announcement - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా నాలుగవ రోజుకూడా బలహీనంగా కొనసాగుతున్నాయి. స్వల్ప ఊగిసలాటతో ప్రారంభమై, అమ్మకాలు ఊపందుకోవడంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 160 పాయింట్లు క్షీణించి 38,570 వద్ద, నిఫ్టీ సైతం 57పాయింట్ల నష్టంతో 11,499 వద్ద ట్రేడవుతోంది. దీంతో నిఫ్టీ 11500 స్థాయి వద్ద గట్టి రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటోంది. 

ప్రధానంగా మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, ఆటో నష్టపోతున్నాయి. అలాగే ఫలితాలు అంచనాలను అధిగమించలేకపోవడంతో టీసీఎస్‌, ప్రమోటర్ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమనడంతో ఇండితో షేర్లు భారీగా పతనమవుతున్నాయి.  టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్, ఐవోసీ, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ  నష్టపోతుండగా, కోల్‌ ఇండియా, టైటన్‌, యస్‌ బ్యాంక్‌, విప్రో, జీ, ఇన్ఫోసిస్‌ స్వల్పంగా  లాభపడుతున్నాయి. 

Advertisement
Advertisement