శాంసంగ్‌ 'హ్యాపీ అవర్స్‌ సేల్‌' | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ 'హ్యాపీ అవర్స్‌ సేల్‌'

Published Sat, Dec 9 2017 12:56 PM

Samsung hosting 'Happy Hours' sale on Amazon - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌  'హ్యాపీ అవర్స్‌' సేల్‌కు తెరతీస్తోంది. అమెజాన్‌ ఇండియా ప్లాట్‌ఫామ్‌పై డిసెంబర్‌ 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఈ సేల్‌ను నిర్వహించబోతుంది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌5 ప్రొ, గెలాక్సీ ఆన్‌7 ప్రొ వంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. అదనంగా మొబైల్స్‌పై రూ.6,700 వరకు తగ్గింపును అందుబాటులో ఉంచనున్నట్టు శాంసంగ్‌ తెలిపింది. అమెజాన్‌లో శాంసంగ్‌ గెలాక్సీ సీ9 ప్రొ(6జీబీ) ధర రూ.29,900గా ఉంది. ఈ ఫోన్‌ అసలు ధర 34వేల రూపాయలు. అంటే 12 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. అదేవిధంగా గెలాక్సీ ఏ7(2017) స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.27,700 నుంచి రూ.20,990కి తగ్గింది. శాంసంగ్‌ గెలాక్సీ ఏ5(2017) స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.17,990కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.24,500.


శాంసంగ్‌ ఆన్‌8 స్మార్ట్‌ఫోన్‌ కూడా 14 శాతం తగ్గింపుతో రూ.11,590కి లిస్టు అయింది. గెలాక్సీ జే5(2016) స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,990కి బదులు రూ.9,190కు కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా శాంసంగ్‌ తాజాగా తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ నోట్‌ 8 రూ.67,900కి దిగొచ్చింది. అటు క్రిస్మస్‌ కార్నివల్‌ సేల్‌ను కూడా శాంసంగ్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌ డిసెంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 15 వరకు జరుపుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్పీకర్లు, ఆడియో యాక్ససరీస్‌, వేరబుల్‌ డివైజ్‌లు, టెలివిజన్లపై డీల్స్‌ను అందిస్తోంది. అన్ని ఆర్డర్లపై కంపెనీ ఉచితంగా డెలివరీ చేస్తోంది.  

Advertisement
Advertisement