రెడ్‌మి ఎస్‌2 నేడే లాంచింగ్‌ | Sakshi
Sakshi News home page

రెడ్‌మి ఎస్‌2 నేడే లాంచింగ్‌

Published Thu, May 10 2018 9:34 AM

Redmi S2 Launch Today - Sakshi

రెడ్‌మి సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనీస్‌ మొబైల్స్‌ దిగ్గజం షావోమి నేడు లాంచ్‌ చేస్తోంది. మరికొన్ని గంటల్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి ఎస్‌2ను షావోమి రివీల్‌ చేయబోతోంది. రెడ్‌మి సిరీస్‌లో బెస్ట్‌ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా ఇది వినియోగదారుల ముందుకు వస్తోంది. చైనా, భారత మార్కెట్లను టార్గెట్‌గా చేసుకుని షావోమి ఈ స్మార్ట్‌ఫోన్‌ను తన స్వదేశంలో ప్రవేశపెడుతోంది. లాంచ్‌ ఈవెంట్‌ చైనాలో మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనుంది. గత కొన్ని వారాలుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, స్పెషిషికేషన్లు, డిజైన్‌, ఫీచర్లపై పలు లీకేజీలు మార్కెట్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

ఒకవేళ ఆ లీకేజీలే కనుక నిజమైతే.. రెడ్‌మి ఎస్‌2 మూడు వేరియంట్లలో రాబోతున్నట్టు తెలుస్తోంది.ఒకటి 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ దీని ధర సీఎన్‌వై 1000(సుమారు రూ.10,500) కంటే తక్కువగా ఉండబోతోంది. మరొకటి 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌, దీని ధర 165.99 డాలర్లు అంటే సుమారు రూ.11,100గా ఉండనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా చివరిది 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌. అయితే ఈ టాప్‌ వేరియంట్‌ ధర ఎంత ఉండొచ్చనది ఇంకా క్లారిటీ లేదు.

రెడ్‌మి ఎస్‌2 స్పెషిఫికేషన్లు...
5.99 అంగుళాల డిస్‌ప్లే విత్‌ హెచ్‌డీ ప్లస్‌ రెజుల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆధారిత ఎంఐయూఐ 9 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీ
బ్లాక్‌, రోజ్‌ గోల్డ్‌, వైట్‌, బ్లూ, రెడ్‌, పింక్‌, గ్రే, సిల్వర్‌ రంగుల్లో లభ్యం
16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
వెనుక వైపు 12 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌తో డ్యూయల్‌ కెమెరా
256జీబీ వరకు విస్తరణ మెమరీకి అవకాశం
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
Advertisement