ఆర్‌బీఐ పాలసీపై ఉత్కంఠ!

RBI begins 2-day policy review; industry, govt want rate cut

కీలక వడ్డీరేట్లపై నేడు ప్రకటన

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెండు రోజుల నాల్గవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. కీలక రేట్లపై ప్రత్యేకించి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6 శాతం) తగ్గింపుపై గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోనుంది.

మందగమనంలో ఉన్న వృద్ధికి ఊతం ఇవ్వడానికి రెపో రేటు కోత తగ్గింపు తప్పదని పారిశ్రామిక వర్గాలు కోరుకుంటుండగా, ఈ విషయంలో రేటు తగ్గింపు ద్వారా తమకు ఆర్‌బీఐ నుంచి స్నేహహస్తం అందుతుందని ప్రభుత్వ వర్గాలు సైతం ఆశగా ఉన్నాయి. రేటును 1% తగ్గించాలని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అయితే రేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చన్న ఆందోళనలూ మరోవైపు నెలకొనడంతో ఆర్‌బీఐ రేటు కోత నిర్ణయం తీసుకోకపోవచ్చని, యథాతథ పరిస్థితి కొనసాగించడానికే అవకాశం ఉందని కొందరు బ్యాంకర్లు విశ్లేషిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top