నీతా అంబానీకి కూడా... | Nita Ambani gets 'Y' category security cover | Sakshi
Sakshi News home page

నీతా అంబానీకి కూడా...

Jul 26 2016 9:33 AM | Updated on Sep 4 2017 6:24 AM

నీతా అంబానీకి కూడా...

నీతా అంబానీకి కూడా...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ చైర్మెన్ ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీకి కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరీ భద్రత కల్పించింది.

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ చైర్మెన్ ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీకి కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరీ భద్రత కల్పించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ ( సీఆర్పీఎఫ్‌) కమాండోలు ఆమెకు రక్షణ కల్పిస్తారు. నీతా అంబానీకి ముప్పు పొంచివుందని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐఎం), కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారంతో ఆమెకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించారు. పదిమంది సీఆర్పీఎఫ్‌ సాయుధ కమాండోలతో ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేశారు.

ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ నుంచి ప్రమాదం పొంచివుందన్న నిఘా వర్గాల సమాచారంతో ముఖేశ్ అంబానీకి మూడేళ్ల క్రితమే ప్రభుత్వం ‘జెడ్‌’ కేటగిరీ భద్రత కల్పించింది. ఇందుకోసం సీఆర్పీఎఫ్ కు ఆయన నెలకు రూ. 15 లక్షలు చెల్లిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement