హోండా యాక్టివా 5జీ వచ్చేసింది... | New Honda Activa 5G unveiled at Auto Expo 2018 | Sakshi
Sakshi News home page

హోండా యాక్టివా 5జీ వచ్చేసింది...

Feb 7 2018 3:14 PM | Updated on Feb 7 2018 6:50 PM

New Honda Activa 5G unveiled at Auto Expo 2018 - Sakshi

ఆటో ఎక్స్‌పోలో కొత్త హోండా యాక్టివా 5జీ

ద్విచక్ర వాహన మార్కెట్‌లో బాగా ఫేమస్‌ అయిన హోండా యాక్టివా ఐదో జనరేషన్‌ వచ్చేసింది. కొత్త యాక్టివా 5జీని ఆటో ఎక్స్‌పో 2018లో హోండా మోటార్‌సైకిల్‌, స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లు ఆవిష్కరించాయి. కొత్త డీలక్స్‌ వేరియంట్‌, ఫుల్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, పొజిషన్‌ ల్యాంప్‌, కొత్త ఫ్రంట్‌ క్రోమ్‌ గార్నిష్‌తో ఈ ఐదవ జనరేషన్‌ యాక్టివాను మార్కెట్‌లోకి ఆవిష్కరించినట్టు హోండా చెప్పింది. 

ఈ కొత్త యాక్టివా 5జీ రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఒకటి డజెల్‌ యెల్లో మెటాలిక్‌, రెండు పెర్ల్ స్పార్టన్ రెడ్. అంతేకాక ఫ్రంట్‌ హుక్‌, సీట్‌ ఓపెనర్‌ స్విచ్‌తో 4-ఇన్‌-1 లాక్‌, కొత్త మఫ్లర్‌ ప్రొటెక్టర్‌లు కూడా ఉన్నాయి. మెకానిక్‌ పరంగా యాక్టివా 5జీ అలానే ఉండనుంది. 109సీసీ, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్, బీఎస్‌-4 ఇంజిన్‌ నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఈ కొత్త స్కూటర్‌ త్వరలోనే మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.

1
1/1

కొత్త హోండా యాక్టివా 5జీ

Advertisement
 
Advertisement
Advertisement