వచ్చేవారంలో నిఫ్టీని నడిపించే అంశమేది..? | Sakshi
Sakshi News home page

వచ్చేవారంలో నిఫ్టీని నడిపించే అంశమేది..?

Published Sat, May 30 2020 2:56 PM

Lockdown status to decide Nifty’s next course - Sakshi

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ ఈ వారంలో భారీ లాభాల్ని మూటగట్టుకుంది. కరోనా కేసుల పెరుగుదల, మరణాలను లెక్కచేయకుండా సెన్సెక్స్‌ ఈ వారం 4రోజుల ట్రేడింగ్‌(రంజాన్‌ సందర్భరంగా సోమవారం సెలవు)లో సెన్సెక్స్‌ 1,752 పాయింట్లును, నిఫ్టీ 541 పాయింట్లను ఆర్జించాయి. 

ఉద్దీపన ప్యాకేజీ పరిమాణంతో సంబంధం లేకుండా అనేక దేశాలకు చెందిన ఈక్విటీ సూచీలు గుడ్డిగా అమెరికా మార్కెట్లను మాత్రమే అనుసరిస్తున్నాయి. అమెరికాకు చెందిన డో జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ప్రపంచ ఈక్విటీ ఇండెక్స్‌ల్లో కెల్లా అత్యంత స్థిరంగా రాణించే ఇండెక్స్‌ అని మరోసారి నిరూపితమైంది. మార్చి 2020 కనిష్ట స్థాయి నుంచి అత్యంత వేగంగా రికవరిని సాధించింది. ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులను ప్రతిబింబించే వీఐఎక్స్‌ ఇండెక్స్‌ భారీగా తగ్గింది. 

ఈ వారం ప్రధాన ఈవెంట్‌
ఈ వారం దేశీయంగా పరిణామాలను పరిశీలిస్తే.., మార్కెట్‌ వర్గాలు ప్రధానంగా త్రైమాసిక ఫలితాలపై దృష్టిని సారించాయి. లాక్‌డౌన్‌ విధింపు, కరోనా కేసుల నేపథ్యంలో త్రైమాసిక ఫలితాల పరిగణలోకి తీసుకోవడం హాస్యాస్పదం అవుతుంది. అయితే ఫలితాల సందర్భంగా కంపెనీల యాజమాన్యం ప్రకటించే అవుట్‌లుక్‌తో రానున్న రోజుల్లో ఆయా రంగాల పరిస్థితులను అంచనావేయవచ్చు. ఫలితాల విడుదల సందర్భంగా ఫార్మా షేర్ల కంపెనీలు ప్రకటించిన అవుట్‌లుక్‌ మార్కెట్‌ను కొంత నిరుత్సాహానికి గురిచేసింది. అమెరికా నుంచి ధరల ఒత్తిడి పెరుగుతున్నట్లు ఫార్మా కంపెనీలు తెలిపాయి. సిమెంట్‌ కంపెనీల అవుట్‌లుక్‌ వ్యాఖాలను పరిశీలిస్తే... స్వల్పకాలానికి మంచి వృద్ధిని సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలు సిమెంట్‌ ధరలను పెంచేందుకు సన్నాహాలు చేసుకుంటాయని తెలుస్తోంది. కరోనా బారిన సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యతనిస్తారని అటో కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వ్యాఖ్యానాలు రానున్న రోజుల్లో ఈ రంగ షేర్లపై బుల్లిష్‌ వైఖరిని కలిగిస్తాయి.

నిఫ్టీ సాంకేతిక అవుట్‌లుక్‌: 
నిఫ్టీ -50 ఇండెక్స్‌ తన వీక్లీ ఛార్ట్‌లో హ్యమర్‌ కేండిల్‌ స్టిక్‌ ఏర్పాటు అనంతరం ఒక పెద్ద బుల్లిష్‌ క్యాండిల్‌ను రూపొందించింది. తద్వారా స్వల్పకాలం పాటు బుల్లిష్‌ వైఖరి కలిగి ఉంటుందని స్పష్టం అవుతోంది. నిఫ్టీ ఇండెక్స్‌ అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీని అనుసరించవచ్చు. స్టాక్‌ మార్కెట్‌లో మే చివరివారం నుంచి నెలకొన్న ఆశావహన వైఖరి, బుల్లిష్‌ ధోరణిలు నిఫ్టీని 10వేలకు స్థాయిని పరీక్షించే అవకాశాన్ని సూచిస్తుంది. స్టాక్‌ మార్కెట్‌లో మే చివరివారం నుంచి నెలకొన్న ఆశావహన వైఖరి, బుల్లిష్‌ ధోరణిలు నిఫ్టీని 10వేలకు స్థాయిని పరీక్షింప చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఐతే 9900-10000 శ్రేణిలో నిఫ్టీ ఏర్పరుచుకున్న కీలక నిరోధాన్ని చేధించడం కొంత కష్టతరం అవుతుంది.

వచ్చేవారం మార్కెట్‌ అంచనాలు
వచ్చే వారంలో మార్కెట్‌ను ‘‘లాక్‌డౌన్‌ పొడగింపు లేదా ఎత్తివేత’’ అనే అంశం కీలకం కానుంది. లాక్‌డౌన్‌ అంశంపై కేంద్రం రేపు, లేదా ఎల్లుండి తన నిర్ణయాన్ని వెలువరించనుంది. సాధారణంగా మార్కెట్‌ లాక్‌డౌన్ ముగింపు నిర్ణయాన్ని స్వాగతిస్తుంది. ఒకవేళ కేంద్రం లాక్‌డౌన్‌ పొడగింపుకే మొగ్గుచూపితే ఫైనాన్స్‌ రంగ షేర్లపై మరింత ఒత్తిడి నెలకొన్ని మార్కెట్‌ నష్టాల్లోకి నడుస్తుందనే అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేత జరిగితే మార్కెట్లో రిలీఫ్‌ ర్యాలీ జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం ఉత్తమం. ఎందుకంటే ఇటువంటి ర్యాలీలు ధీర్ఘకాలం పాటు కొనసాగవు.

Advertisement
Advertisement