మారుతీతో హెచ్డీఎఫ్సీ ఎర్గో జట్టు | HDFC ERGO, Maruti Insurance to offer insurance to Maruti Suzuki | Sakshi
Sakshi News home page

మారుతీతో హెచ్డీఎఫ్సీ ఎర్గో జట్టు

Nov 14 2016 1:09 AM | Updated on Sep 4 2017 8:01 PM

మారుతీతో హెచ్డీఎఫ్సీ ఎర్గో జట్టు

మారుతీతో హెచ్డీఎఫ్సీ ఎర్గో జట్టు

దేశీ ప్రముఖ ప్రైవేట్ రంగ నాన్-లైఫ్ బీమా సంస్థ ‘హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్‌‌స’ కంపెనీ తాజాగా మారుతీ ఇన్సూరెన్‌‌సతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ముంబై: దేశీ ప్రముఖ ప్రైవేట్ రంగ నాన్-లైఫ్ బీమా సంస్థ ‘హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్’ కంపెనీ తాజాగా మారుతీ ఇన్సూరెన్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మారుతీ ఇన్సూరెన్‌‌స... దేశంలో అతిపెద్ద వాహన బీమా బ్రోకరేజ్ సర్వీస్ సంస్థ. తాజా ఒప్పందంలో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఇక నుంచి మారుతీ సుజుకీ వాహన కొనుగోలుదారులకు వాహన బీమాను ఆఫర్ చేస్తుంది. మారుతీ కస్టమర్లకు తక్షణ పాలసీ ఆమోదం సౌకర్యంతోపాటు సాధ్యమైనంత త్వరగా సులభతరంగా క్లెరుుమ్ సెటిల్‌మెంట్ చేస్తామని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మారుతీ సుజుకీ వాహన కొనుగోలుదారులు మారుతీ ఇన్సూరెన్‌‌స ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో నుంచి సమగ్రమైన మోటార్ ఇన్సూరెన్‌‌స పాలసీ తీసుకోవచ్చు. అలాగే వీరు క్యాష్‌లెస్ క్లెరుుమ్ సర్వీసులు వంటి సౌలభ్యాలను కూడా పొందొచ్చు’ అని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఎండీ, సీఈవో రితేశ్ కుమార్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement