తగ్గిన బంగారం ధరలు | Sakshi
Sakshi News home page

తగ్గిన బంగారం ధరలు

Published Wed, Dec 6 2017 5:52 PM

Gold, Silver Prices Plunge Today On Muted Demand - Sakshi

న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్‌ స్తబ్దుగా ఉండటం, అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌ కొనసాగుతుండటంతో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు రూ.200 మేర తగ్గాయి. బుధవారం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధరలు 200 రూపాయలు తగ్గి రూ.30,050గా నమోదయ్యాయి. అంతేకాక వెండి ధరలు కూడా కిందకి పడిపోయాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో, వెండి ధరలు రూ.500 తగ్గి, కేజీకి రూ.38,500గా రికార్డయ్యాయి.

అంతర్జాతీయంగా కూడా బంగారం ధర 0.76 శాతం తగ్గి, ఔన్స్‌కు 1,265.90 డాలర్లు, వెండి ధర 1.41 శాతం క్షీణించి, ఔన్స్‌కు 16.06 డాలర్లు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధరలు 200 రూపాయల చొప్పున తగ్గి, రూ.30,050గా, రూ.29,900గా ఉన్నాయి. 

Advertisement
Advertisement