హూస్టన్: ఈ ప్రపంచంలో చాలా చౌకగా జీవించేందుకు అనువైన దేశాల్లో భారత్ రెండో స్థానం దక్కించుకుంది. దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. గోబ్యాంకింగ్రేట్స్ అనే సంస్థ ఇటీవలి కాలంలో 112 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. స్థానికంగా కొనుగోలు శక్తిని ప్రతిబింబించే సూచీ, ఇంటి అద్దె సూచీ, గ్రోసరీల సూచీ, వినియోగ ధరల సూచీ అనే ఈ నాలుగు కొలమానాల ఆధారంగా ప్రపంచ దేశాలకు గోబ్యాంకింగ్ ర్యాంకులను కేటాయించింది.
♦ ఇంటి అద్దె నేపాల్ తర్వాత చాలా తక్కువగా ఉన్నది భారత్లోనే.
♦ వినియోగ ఉత్పత్తులు, గ్రోసరీలు కొన్ని మన దగ్గరే చాలా తక్కువ ధరలకు లభ్యమవుతున్నాయి. కోల్కతా నగరంలో ఓ వ్యక్తి నెలసరి వ్యయం 285 డాలర్లు.
♦ 50 చౌక దేశాల్లో అధిక జనాభా ఉన్నది కూడా మనదగ్గరే (125 కోట్లు). టెక్స్టైల్స్, కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడి ప్రధాన పరిశ్రమలు.
♦ భారత్లో స్థానిక కొనుగోలు శక్తి 20.9 శాతం తక్కువ. అద్దె 95.2 శాతం చౌక. గ్రోసరీలు 74.4 శాతం చౌక. స్థానిక సరుకులు, సేవలు కూడా 74.9 శాతం తక్కువే. స్థానిక కొనుగోలుశక్తిని, ఇంటి అద్దెలను, ఆహారోత్పత్తుల ధరలను న్యూయార్క్ సిటీతో పోల్చారు.
♦ కొలంబియా (13), పాకిస్థాన్ (14), నేపాల్ (28), బంగ్లాదేశ్ (40) కంటే కూడా భారత్ నివాసానికి ఎంతో చౌక.
♦ జీవించడానికి, విశ్రాంత జీవనానికి దక్షిణాఫ్రికా ప్రపంచంలోనే అత్యంత చౌకైన దేశంగా ఈ సర్వే పేర్కొంది. ఖరీదైన ప్లాటినం, బంగారం, క్రోమియం లోహాలను భారీగా ఉత్పత్తి చేస్తుండడంతో ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తి న్యూయార్క్ వాసుల కంటే ఎక్కువే ఉంది.
♦ ఇక జీవించేందుకు అత్యంత ఖరీదైన దేశంగా బెర్ముడా ముందుంది. దీని స్థానం 112 దేశాల్లో చిట్టచివరిది. బహమాస్ 111, హాంగ్కాంగ్ 110, స్విట్జర్లాండ్ 109, ఘనా 108 చొప్పున చివరి స్థానాల్లో ఉన్నాయి.
భారత్లో జీవన వ్యయం ఎంతో చౌక!
Published Mon, Jan 29 2018 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement