ఎయిర్ ఇండియా శుభవార్త | Air India plans to buy 100 more aircrafts over the next 4 years | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా శుభవార్త

May 25 2016 4:40 PM | Updated on Sep 4 2017 12:55 AM

ఎయిర్ ఇండియా  శుభవార్త

ఎయిర్ ఇండియా శుభవార్త

దేశీయ సర్వీసుల కోసం మరో100 విమానాలను కొనేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వరంగ సంస్థ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా తెలిపింది.

న్యూఢిల్లీ:  ఇటీవల సూపర్ సేల్ ఆఫర్ అంటూ విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎయిర్ఇండియా మరో సంచలన ప్రకటన చేసింది.    రాబోయే నాలుగేళ్లలో  మరిన్ని విమానాలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించి దేశంలోని   ప్రముఖ నగరాల్లో విమాన  ప్రయాణ సౌకర్యం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులకు  శుభవార్త అందించింది. 

దేశీయ సర్వీసుల కోసం మరో100 విమానాలను కొనేందుకు ప్రయత్నిస్తున్నామని  ప్రభుత్వరంగ సంస్థ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా తెలిపింది.   వీటి ద్వారా  దాదాపు 32 ప్రాంతీయ నగరాల్లో సర్వీసులకోసం వీటిని వినియోగించనున్నట్టు తెలిపింది.  ఎయిర్ ఇండియా  సీఎండీ అశ్విన్ లోహాని   ఒక  సమావేశంలో  మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement