ఏబీసీడీ2-రూప్‌మంత్ర ‘మీట్-గ్రీట్’ కార్యక్రమం | ABCD 2-roop mantra | Sakshi
Sakshi News home page

ఏబీసీడీ2-రూప్‌మంత్ర ‘మీట్-గ్రీట్’ కార్యక్రమం

Jun 23 2015 12:39 AM | Updated on Sep 3 2017 4:11 AM

ఏబీసీడీ 2 చిత్రం విజయవంతం కావాలన్న ఆకాంక్షను ఎస్‌బీఎస్ బయోటెక్ యూనిట్ 2 ప్రముఖ బ్రాండ్

ఏబీసీడీ 2 చిత్రం విజయవంతం కావాలన్న ఆకాంక్షను ఎస్‌బీఎస్ బయోటెక్ యూనిట్ 2 ప్రముఖ బ్రాండ్ ‘రూప్ మంత్ర’ (ఆయుర్వేదిక్  ఆరోగ్య, సౌందర్యోత్పత్తులు) ప్రతినిధులు వ్యక్తంచేశారు. రిమో డిసౌజా దర్శకత్వంలో వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ చిత్రం జూన్ 19న విడుదలైంది. అంతకుముందు చండీగఢ్‌లో ఏబీసీడీ2-రూప్‌మంత్ర ‘మీట్-గ్రీట్’ కార్యక్రమం జరిగింది.  కంపెనీ సీఎండీ సంజీవ్ జానేజా ఇతర సిబ్బంది అలాగే ఏబీసీడీ 2 చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, సక్రమ అభ్యాసం ద్వారా నాట్యం ఎవరైనా చేయవచ్చని చిత్ర టైటిల్ చెబుతోందని, ఇదే విధంగా రూప్ మంత్ర వినియోగంతో ప్రతి ఒక్కరూ ఆకర్షణీయులుగా మారవచ్చని తమ సందేశమని వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement